తిరువూరు శ్రీ వాహిని ఇంజినిరంగ్ కళాశాల 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఏపి టెలికాం సర్కిల్ జనరల్ మేనేజర్ కె. దామోదరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్, పొలిసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, కళాశాల పాలకవర్గం అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ కె.నాగేంద్రబాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం అర్ధరాత్రి వరకు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.