శివరాత్రి పర్వదిన సందర్భంగా తిరువూరులో పురాతనమైన శ్రీచంద్రమౌళిశ్వర స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు. ఈ రెండు దేవాలయాల్లో శుక్రవారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలోను లక్ష్మి గణపతి దేవాలయంలోను శివరాత్రి ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమీపంలోని తెలంగాణా రాష్ట్రంలో ఉన్న నీలాద్రి గుళ్ళు, గుట్టపాడు తిరునాళ్ళు కూడా జరుగుతున్నాయి.