శివరాత్రి సందర్భంగా కృష్ణా రీజియన్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. శ్రీశైలం సహా జిల్లాలోని పలు శైవక్షేత్రాలకు సైతం ఈ బస్సులు ఏర్పాటు చేశారు. శివరాత్రి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 242 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 24న ఉదయం నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. విజయవాడ సహా నూజివీడు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, మచిలీపట్నం, ఐలూరు, పెదకల్లేపల్లి, ఇబ్రహీంపట్నం, తిరువూరు, అవనిగడ్డ ప్రాంతాల నుంచి.. శ్రీశైలం, ముక్త్యాల, అమరావతి, బలివే, నీలాద్రి, గుట్టపాడు, సంగమేశ్వరం దైవక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు రోజంతా తిరుగుతాయి.