తిరువూరు చీరాల సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన రైతు బజారుకు వచ్చే 27వ తేదీన ప్రారంబోత్సవం చేయడానికి వ్యవసాయ మార్కెట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతు బజారుతో పాటు కొకిలంపాడు రోడ్డులో నూతనంగా నిర్మించిన స్టేడియంకు కూడా ప్రారంబోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపి కేశినేని నాని తదితరులు తరలివస్తున్నట్లు సమాచారం.