కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున శ్రీరాం తాతయ్య (శ్రీరాంరాజ్గోపాల్) ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లోనే ఆయన రాజశేఖర్రెడ్డి హవాలో అప్పటి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును ఓడించి అందరికి షాక్ ఇచ్చారు. తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా మరోసారి తాతయ్య ఉదయభానుపై విజయం సాధించారు.కాపుల కంచుకోట అయిన జగ్గయ్యపేటలో ఉదయభాను రెండు దశాబ్దాలుగా టీడీపీకి యాంటీగా కాంగ్రెస్, వైకాపా తరపున చక్రం తిప్పుతున్నారు. అలాంటి ఉదయభాను ప్రభావాన్ని ఆయన రెండుసార్లు తట్టుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక కేబినెట్ ప్రక్షాళనలో వైశ్య సామాజికవర్గానికి చెందిన తాతయ్యకు బెర్త్ ఇవ్వాలని బాబు భావిస్తున్నారట.శ్రీరాం తాతయ్య వివాదాలకు దూరంగా ఉండడమే ఆయనకు కలిసి రానుంది. ఇక బాబు కేబినెట్లో వైశ్య సామాజికవర్గం నుంచి ప్రకాశం జిల్లాలో మంత్రిగా ఉన్న సిద్ధా రాఘవరావు పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. రాఘవరావును పనితీరు మార్చుకోమని బాబు ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పినా ఆయన పనితీరులో మార్పు లేకపోవడంతో విస్తరణలో ఆయన్ను తప్పించి అదే కోటాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాతయ్యకు అదే రోడ్లు భవనాల శాఖ ఇవ్వాలని బాబు భావిస్తున్నారట. అదే జరిగితే తాతయ్యకు లక్ చిక్కినట్టే అనుకోవాలి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.