అత్యున్నత న్యాయస్థానాల తాజా తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో కోడిపందేల నిర్వహణపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అడ్డుకోవడానికి ఓ వైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా, మరోవైపు నిర్వాహకులు తమ ఏర్పాట్లలో ఉన్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది పండుగకు పది రోజుల ముందునుంచే కోడిపందేలను నిర్వహించేవారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండీ మండలం జువ్వలపాలెం, కలుగుపూడి, ఆకివీడు, మండలం అయిభీమవరం, భీమవరంలోని ఆశ్రఒతోటలు, ద్వారకాతిరుమల, పెదవేగి, పెదపాడు మండలాల్లో అధికంగా పందేలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, జగ్గంపేట, సామర్లకోట, కిర్లంపూడి ప్రాంతాల్లో పందేలను నిర్వహించేవారు. కృష్ణాజిల్లా నుజవీడు, హనుమాన్ జంక్షన్, నాగాయలంక, కృత్తివెన్ను, పెడన ప్రాంతాల్లో కోళ్ళను బరిలోకి దింపుతారు. పశ్చిమలోని ఆకివీడు మండలం, అయిభీమవరం, భీమవరంలలో పెద్దఎత్తున నిర్వహించే పందేలను చూడడానికి, పందెం కాయడానికి తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు ఇక్కడికి చేరుకునేవారు. గత సీజన్లో ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో దాదాపు వంద కోట్లకు పైగా కోడిపందేల వ్యాపారం జరిగినట్లు అంచనా. మహాదేవపట్నం, కాళ్లకూరు, ఉండి, జువ్వలపాలెం, అప్పారావుపేట, భీమవరం, ఆశ్రమంతోట, కొరుకొల్లు వంటి ప్రాంతాలు ప్రధాన వేదికలుకాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో పందేలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. భీమవరం మండలం వెంపతోపాటు పైన పేర్కొన్న కొన్ని బరుల్లో తక్కువ స్తాయిలో పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో పండుగ ముడురోజులే పందేలు నిర్వహించాలని పందెం రాయుళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ద్యా, ఉపాధి, వైద్య అవకాశాలపై ప్రత్యెక సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబందించిన వివరాలివి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.